
కాంగ్రెస్‌ది అప్రజాస్వామ్య పాలన
సిరిసిల్లటౌన్: కాంగ్రెసోళ్లు చెప్పుకుంటున్నట్లు రాష్ట్రంలో ప్రజాపాలన లేదని.. అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెసోళ్లు ఇష్టానుసారంగా వ్వవహరిస్తున్నారని ఆరో పించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి రూపాయి తీసుకోకుండా అర్హులకు డ్రా ప ద్ధతిలో డబుల్‌బెడ్‌రూమ్ ఇచ్చిందన్నారు. 2014లో పేదలకు ఇవ్వాల్సిన గృహాల ఖర్చు రూ.5లక్షలైతే.. ఇప్పుడు కూడా అంతే ఎలా ఇస్తారన్నారు. ఇందిరమ్మ ఇల్లుకు రూ.10లక్షలు ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అడ్డదారుల్లో అమ్ముకుంటుండ్రని ఆరోపించారు. అవసరాల దృష్ట్యా వారానికి మూడు రోజులు ఇసుక రవాణాకు అనుమతించాలని కోరారు. తమ ప్రభుత్వం పేదల కు ఇండ్లను డ్రా పద్దతిలో ఇస్తే.. ఈసర్కారు కాంగ్రెస్ నేతల అనుయాయులకు పంచుతున్నారని ఆరో పించారు. గత కలెక్టర్, పాలకవర్గం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే మిగతా వా రికి అందించాలన్నారు. బీఅర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుండారపు కృష్ణారెడ్డి, ఎండీ సత్తార్, సురేష్‌నాయక్ పాల్గొన్నారు.