
సాహిత్యం సమాజ శ్రేయస్సును కాంక్షించాలి
సిరిసిల్లకల్చరల్: సమాజ శ్రేయస్సును కాంక్షించే సాహిత్యమే ప్రజల్లో నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చక్రాల మల్లేశ్ రాసి, వెలువరించిన దర్పణం పుస్తకావిష్కరణ గాంధీనగర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో జరిగింది. సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, బాల సాహిత్యవేత్త వాసరవేణి పర్శరాములు అతిథులుగా హాజరయ్యారు. ఏనుగుల ఎల్లయ్య, బూర దేవానందం, గడ్డం పర్శరాములు, సుల్తానా మల్లేశ్, గోపాల్‌రెడ్డి, వెంగళ లక్ష్మణ్, అంకారపు రవి పాల్గొన్నారు.
● దర్పణం పుస్తకావిష్కరణలో వక్తలు