ఓటర్లను ఓడించారు! | - | Sakshi
Sakshi News home page

ఓటర్లను ఓడించారు!

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

ఓటర్లను ఓడించారు!

పంచాయతీ పోరులో పచ్చ గూండాలకు వత్తాసు పలికిన పోలీసులు టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకున్న వారిపైనే లాఠీచార్జ్‌ కొత్తపట్నం,పీసీపల్లి, కనిగిరి, పామూరు మండలాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు పచ్చ కిరాయి మూకలపై తిరగబడిన మహిళలు కొత్తపట్నంలో ఎమ్మెల్యే దామచర్ల పీఏను తరిమికొట్టిన మహిళలు పీసీపల్లి మండలం పెద్ద ఇర్లపాడులో రీపోలింగ్‌ జరపాలని ధర్నా పామూరులో సాక్షి విలేకరి సెల్‌ఫోన్‌ లాక్కొని దౌర్జన్యం వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థులు గెలిచినా డిక్లరేషన్‌ ఇవ్వకుండా దొంగాట

పీసీపల్లి: కోదండరాంపురంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు ఏజెంట్‌ను లాగేస్తున్న టీడీపీ మూకలు

కొత్తపట్నం : వజ్జిరెడ్డిపాలెంలో పచ్చ గూండాలకు మద్దతిస్తున్న డీఎస్పీని నిలదీస్తున్న మహిళలు

ఎమ్మెల్యే పీఏను తరిమికొట్టిన మహిళలు

కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం, గమళ్లపాలెం, పాదర్తి పంచాయతీలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేయడానికి ఒక్కసారిగా నాలుగు కార్లలో ఒంగోలు ఎమ్మెల్యే పీఏ తోపాటు టీడీపీ నాయకులు వచ్చారు. అక్కడే ఉన్న మహిళలు, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు వారిని తరిమికొట్టారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్‌ ముగిసే వరకూ ఇక్కడే ఉంటామని మహిళలు తేల్చిచెప్పారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు గెలిచే అవకాశం ఉన్న కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం, పాదర్తిలో అధికారులు ఓట్ల లెక్కింపును నిలిపేశారు. దీంతో ఇక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

ఖాకీల అండతో టీడీపీ మూకలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బరితెగించాయి. ఓటమి భయంతో రిగ్గింగ్‌, దాడులు, బెదిరింపులకు తెగబడగా.. వాటిని అడ్డుకున్న ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ మూకలను వదిలేసి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలిచిన వారిపైనే పోలీసు ప్రతాపం చూపడం ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలిచింది.

గురువారం ఉమ్మడి జిల్లాలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు, కందుకూరు, పొదిలి మున్సిపల్‌ పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఇదే దౌర్జన్యం కనిపించింది. పొదిలి పట్టణంలో ఉదయం నుంచే పచ్చమూకలు బరితెగించాయి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన

కిరాయి రౌడీలతో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement