ఒంగోలు సిటీ: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితులు ఉండాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాజ్యాంగం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని, అధికారం, ఆర్థిక స్థోమత, కులమతాలకు అతీతంగా చట్టం అందరికీ సమానంగా వర్తించాలని పేర్కొన్నారు. గురువారం 77వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పాలకుల బాధ్యతలను గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఇన్‌చార్జి ఇనగంటి పిచ్చిరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీల దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, గొడ్డపాకల రవి, పోలినేని వెంకటరావు, 55 వ డివిజన్ కార్పొరేటర్ పల్నాటి రవీంద్రరెడ్డి, 45 వ డివిజన్ అధ్యక్షుడు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, 45వ డివిజన్ ప్రధాన కార్యదర్శి చందోలు చెంచిరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


