రిగ్గింగ్‌ రాజ్యం.. | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌ రాజ్యం..

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

రిగ్గింగ్‌ రాజ్యం..

కందుకూరులో బరితెగించిన పచ్చమూకలు బయట నుంచి కిరాయి మూకలను తెచ్చి పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లను బయటకు లాగి యథేచ్ఛగా దొంగఓట్లు రిగ్గింగ్‌ చేసే మూకలకు పటిష్ట రక్షణ కల్పించిన పోలీసులు

పోలీసులు, టీడీపీ మూకలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఓటర్ల తీర్పును పక్కదారి

పట్టించేందుకు పోలింగ్‌ బూత్‌లనే కబ్జా చేసి రిగ్గింగ్‌కు తెగబడ్డాయి. ప్రతిపక్షానికి ఓటు పడనీయకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఎన్నికలనే అపహాస్యం చేశాయి. గురువారం కందుకూరు, పొదిలి పురపాలికల్లో పోలింగ్‌ సందర్భంగా సాగిన ఈ గూండాగిరిపై ప్రజలు మండిపడుతున్నారు. బూత్‌లను ఆక్రమించి ఓట్ల దొంగతనానికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు చూసిన సాధారణ జనం ‘ఇవేం ఎన్నికలు.. ఇదేం ప్రజాస్వామ్యం’ అంటూ హడలిపోయారు.

కందుకూరు: కందుకూరులో గురువారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ గూండాలు పూర్తిగా బరితెగించారు. ప్రతిపక్ష పార్టీకి ఓట్లే పడకూడదు అన్న తరహాలో బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగానే సాగింది. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. ఎక్కడైతే వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఓటింగ్‌ సరళి ఉందో, టీడీపీ అభ్యర్థులు ఎక్కడైతే ఓడిపోతారని అనుమానం వచ్చిందో వెంటనే పోలీసులు, టీడీపీ గూండాలు రంగంలోకి దిగిపోయారు. ఏదో ఒక సాకు చెప్పి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లను బయటకు లాగిపడేయడం మొదలుపెట్టారు. మధ్యహ్నం 3 గంటల నుంచి పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ మొదలైంది. గ్రామాల నుంచి తీసుకొచ్చి లాడ్జిల్లో దాచిపెట్టిన టీడీపీ గూండాలను రంగంలోకి దించారు. వారికి సహకరించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకరు ఇద్దరు దొంగ ఓటర్లను బూత్‌లోకి పంపడం.. వారిని గుర్తించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లు అభ్యంతరం తెలిపిన వెంటనే పోలీసులు వెళ్లి ఏజెంట్‌లను బయటకు లాక్కురావడం పరిపాటిగా మారిపోయింది. అనంతరం బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అయితే తాము పోలీసులం అన్న కనీస జ్ఞానాన్ని మరిచిపోయిన పోలీస్‌ అధికారులు రిగ్గింగ్‌ ప్రక్రియకు దగ్గర ఉండి కాపలాకాశారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వైఎస్సార్‌ సీపీ నేతలు వెళ్లితో వారిని దూరంగా తరిమేయడంతో ఇటువంటి అరాచకాలకు పోలీసులు పాల్పడ్డారు. ఇలా మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డుల్లో పోలీసుల ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌ చేశారు. ఇదంతా పోలింగ్‌ సమయం ముగిసే సమయం 5 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం.

దొంగ ఓటర్లను పట్టుకున్న వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి కోటేశ్వరరావు:

9వ వార్డు సుందరయ్య నగర్‌ పోలింగ్‌ కేంద్రం సాయంత్రం 4 గంటల తరువాత పూర్తిగా టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. పెద్ద ఎత్తున గంజాయి బ్యాచ్‌ను రంగంలోకి దించి ఓట్లు వేయించడం ప్రారంభించారు. విషయం తెలుసుకుని వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు, ఆయన సతీమణి వసంతలక్ష్మి అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో క్యూలైన్‌లో ఉన్న ఓటర్లను స్లిప్పులు, ఐడీకార్డులు చూపించమని అడిగితే ఒక్కరి దగ్గర కూడా సరైన కార్డులు లేవు. ఎక్కడి నుంచి „ మిగతా 8లో..

కందుకూరు మున్సిపాలిటీ 9వ వార్డు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేయించడాన్ని నిరశిస్తూ బూత్‌ వద్ద బైఠాయించిన వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ వసంత లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement