ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సామూహిక రిగ్గింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సామూహిక రిగ్గింగ్‌

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

కందుకూరు రూరల్‌:

నియోజకవర్గ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మున్సిపల్‌ ఎన్నికల్లో సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ కందుకూరు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. మున్సిపల్‌ పోలింగ్‌లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడటంపై అభ్యర్థులతో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ పోలీసుల ఆధ్వర్యంలో కూటమి నాయకులు కలిసికట్టుగా దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ చేశారన్నారు. పోలీసులు దగ్గరుండి కూటమి నాయకులకు సహకరిస్తూ వారి కనుసన్నలో ఈ రాక్షస క్రీడ ఆడించారని దుయ్యబట్టారు. గ్రామాల నుంచి ఆటోల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్‌ ప్రశాంతంగా సాగిందని, కానీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగేసి రిగ్గింగ్‌ చేశారన్నారు. ఎక్కువగా 30 నుంచి 35 వార్డుల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. 2గంటల వరకు జరిగిన పోలింగ్‌ సరళని చూసిన కూటమి నాయకులు ఓడిపోతామనే భయంతోనే ప్రజాస్వామ్యామన్ని ఖూనీ చేస్తూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు.

వైఎస్సార్‌ సీపీకి భయపడే రిగ్గింగ్‌...

వైఎస్సార్‌ సీపీకి భయపడే దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని చైర్మన్‌ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు అన్నారు. పోలీస్‌ బలగాలతో నిజాయితీగా రీ ఎలక్షన్‌ చేస్తే గెలుపెవరిదో తెలుస్తోందన్నారు. టీడీపీ వారు ఎవరైనా గుంపు గుంపులుగా పోలింగ్‌ బూత్‌లోకి పంపించారని, అభ్యర్థినైన నన్ను మాత్రం ఒకరే వెళ్లాలని నిబంధనల పెట్టడం ఏంటని పోలీసులు, అధికారులు పనితీరని మండిపట్టారు. ప్రత్యక్షంగా ఎన్ని దొంగ ఓట్లు పట్టుకున్నామో వీడియోలు ఉన్నాయని తెలిపారు.

మహిళల ఓట్లు వేసేందుకు కాలేజీ విద్యార్థులు

తొమ్మిదవ వార్డులోని సుందరయ్య నగర్‌ బూత్‌లో మహిళల ఓట్లు వేసేందుకు వంది మంది కాలేజీ విద్యార్థులకు తీసుకువచ్చారని చీఫ్‌ ఏజెంట్‌, చైర్మన్‌ అభ్యర్థి సతీమణి వసంతలక్ష్మి తెలిపారు. దొంగ ఓటర్లుగా వచ్చిన విద్యార్థుల గురించి ఎస్సైకు ఫోన్‌ చేసి చెబితే.. పాస్‌కు వెళ్లాలని సమాధానం ఇచ్చారని, ఓ మహిళకు ఎస్సై చెప్పే సమాధానం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. మొత్తం 40 వార్డులకు చీఫ్‌ ఏజెంట్‌గా ఉంటే 32వ వార్డు మినహా అన్ని వార్డుల్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ జరిగిందన్నారు. ఇది పోలీస్‌లు దగ్గరుండి చేయించానని తెలిపారు. ఓటమి భయంతోనే రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. అనంతరం వార్డుల వారి అభ్యర్థులు మాట్లాడుతూ 25వ వార్డులో పోలీసులు, పోలింగ్‌ అధికారులే అధికార పార్టీ నాయకులు సూచనలు సహాలు ఇస్తున్నారని తెలిపారు. దొంగ ఓటర్లకు కనీసం చొక్కాలైనా మార్చి పంపించండని పోలింగ్‌ అధికారే సలహా ఇస్తున్నారంటే ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వార్డులో లేని వారిని కూడా తీసువచ్చి కేవలం ఓటరు స్లిప్పులతో ఓటు వేయించారని ఇదేంటని ప్రశ్నిస్తే సీఐ బెదిరించారని వాపోయారు. 12వ వార్డులో పురుషులకు గుర్కాలు వేసి దొంగ ఓట్లు వేయించారని ఏజెంట్‌ రాజేష్‌ తెలిపాడు. 33వ వార్డులో బడేవారిపాలెం నుంచి సుమారు 25 మంది వచ్చి బూత్‌లోకి వెళ్లి దొంగ ఓట్లు వేశారని తెలిపారు.

పోలీసులు, ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌

ఇది కూటమి నేతలు ఆడిన రాక్షస క్రీడ

మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రశాంతం..

ఆ తర్వాత రిగ్గింగ్‌

మున్సిపల్‌ పోలింగ్‌పై మండిపడిన బుర్రా

మధుసూధన్‌ యాదవ్‌

నిజాయితీగా గెలవాలంటే రీ పోలింగ్‌

నిర్వహించాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement