పొదిలిలో గూండాగిరి.. | - | Sakshi
Sakshi News home page

పొదిలిలో గూండాగిరి..

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

పొదిలిలో గూండాగిరి.. „ 7వ పేజీ తరువాయి

సోదరుడి కుమారుడు ఆధ్వర్యంలో అల్లరి మూకలు పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపించారు. లోపల యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. విషయం తెలసుకున్న వైఎస్సార్‌ సీపీ వర్గీయులు మూకుమ్మడిగా పోలింగ్‌ కేంద్రం వద్దకు చొచ్చుకొచ్చారు. దీంతో రిగ్గింగ్‌కు పాల్పడే టీడీపీ అల్లరి మూకలను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పోలీసులు వారిని దూరంగా పంపారు. మా ఓట్లు వేరే వాళ్లు వేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్న పోలీసులు మమ్మల్ని ఇళ్లకు పంపించేందుకు ముందుకు వస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. రీ పోలింగ్‌ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ వర్గీయులు డిమాండ్‌ చేశారు. కొనకనమిట్ల ఎస్‌ఐ శ్రీకాంత్‌ దళిత మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా లాఠీతో దాడులు చేశారు. ఇదిలా ఉండగా నందిపాలెంలో జెడ్పీ చైరపర్సన్‌ కందుల రామిరెడ్డి కొడుకు రోహిత్‌ రెడ్డి దాడికి తెగబడ్డాడు. పోలీసుల ముందే బూత్‌ ఏజెంట్లను లాక్కొచ్చి కొట్టారు. వీడియో తీస్తున్న ఓ అయ్యప్ప మాలధారుడిపై దాడి చేయడమే కాకుండా అతని ఫోన్‌ లాక్కెళ్లారు.

పోతవరంలో బ్యాలెట్‌ పేపర్లు ఎత్తుకెళ్లిన పచ్చ రౌడీలు:

పోతవరంలోని 18వ వార్డు 1వ పోలింగ్‌ బూత్‌లో జనసేనకు ఓట్లు సక్రమంగా పడడం లేదనే అనుమానంతో మార్కాపురం నుంచి వచ్చిన టీడీపీ దుండగులు రిగ్గింగ్‌ చేసేందుకు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పసిగట్టిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అప్రమత్తమై అభ్యర్థి, ఏజెంట్లు తలుపులు వేశారు. దీంతో లోపలికి ప్రవేశించేందుకు దుండగులు 20 నిముషాల మేర వారిపై దాడికి దిగారు. అయినా అభ్యర్థి, ఏజెంట్లు వారిని నిలువరించారు. ఈ క్రమంలో వార్డు అభ్యర్థి తండ్రి వెంకటేశ్వరెడ్డి చేతికి తీవ్ర గాయమైంది. అప్పటికే రెండు పర్యాయాలు కలెక్టర్‌ విజయ సునీత సందర్శించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో పర్యాయం కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు అందటంతో కేంద్రం వద్దకు వెళ్లాలని పోలీసులను ఆదేశించారు. పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన మొత్తం పోలీసులు వీడియో తీశారు. కానీ దుండగుల దాడిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు చెబుతున్న సమాధానం విని చురకలు అంటించారు. పోలీసులు తీసిన వీడియోను పరిశీలించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. అనంతరం పోలింగ్‌ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయాలని పోలింగ్‌ అధికారిని ఆదేశించారు. 14, 15వ వార్డులలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపి మార్కాపురానికి చెందిన టీడీపీ నేత చంద్రశేఖరరెడ్డి అలియాస్‌ ఇసుక శేఖర్‌ తన వర్గీయులతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 15వ వార్డులో మార్కాపురం జనసేన నేత సయ్యద్‌ సాధిక్‌ ఆధ్వర్యంలో రిగ్గింగ్‌ ప్రయత్నం జరిగింది.

గంజాయి బ్యాచ్‌ వీరంగం:

కంభాలపాడులో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపేందుకు గంజాయి బ్యాచ్‌ ప్రయత్నించింది. అయితే జరగబోతున్న పరిణామాన్ని ముందే పసిగట్టిన స్థానిక వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తిరగబడటంతో గంజాయి బ్యాచ్‌ వాహనాల్లో పారిపోయారు. ఒకటో వార్డులో ఏజెంట్లను బూత్‌ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో అక్కడ వైఎస్సార్‌ సీపీ వర్గీయులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపి పోలింగ్‌ను బహిష్కరించారు. 28వ వార్డు బాప్టిస్ట్‌ పాలెం పోలింగ్‌ బూత్‌ లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను గంజాయి బ్యాచ్‌ ఆదిలోనే అడ్డుకున్నారు. చాలా సేపటి తర్వాత ఒకరిని అనుమతించారు. ఈ క్రమంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12 వ వార్డులో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు గుంజి.. బెల్లంకొండ విద్యా సంస్థల స్టూడెంట్లతో రిగ్గింగ్‌ కు పాల్పడ్డారు. మార్కాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ చోటా నాయకులు బెల్లంకొండ కాలేజీని తమ అడ్డాగా మార్చుకుని దాడులు, దౌర్జన్యాలు, కుట్రల్లో కీలకంగా వ్యవహరించారు. మాదిరెడ్డిపాలెం పోలింగ్‌ బూత్‌ లో రిగ్గింగ్‌ కు పొదిలి సీఐ దగ్గరుండి సహకారం అందించడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. పోతవరం ఎస్సీ కాలనీలో చర్చికి శ్లాబ్‌ వేయిస్తామని నమ్మబలికిన టీడీపీ నేతలు ఆ హామీని నిలబెట్టుకోలేదంటూ స్థానికులు 150 మంది ఓటింగ్‌ కు దూరంగా ఉన్నారు.

1వ వార్డుకు సంబంధించి బుచ్చనపాలెం బూత్‌లో పోలింగ్‌ను వైఎస్సార్‌సీపీ వర్గీయులు, ఏజెంట్లు బహిష్కరించారు. 1వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అభ్యర్థినైన తనను, ఏజెంట్లను పోలీసులు వేధించడంతో ఆందోళనలతో పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ సీనియర్‌ నాయకులు కల్లం సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఎన్నికల సమయంలో పోలీసులు ఇంతలా దిగజారి ప్రవర్తించడం లేదని, మూడు గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోపెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం తప్పు చేస్తే స్టేషన్‌కు పిలిపించారో అర్థం కాలేదన్నారు. పోలింగ్‌ రోజున కూడా వేధింపులు ఎక్కువ కావడంతో చేసేది ఏమి లేక పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోలింగ్‌ బూత్‌ ముందు ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చేందుకు, ఓటర్లను పలకరించేందుకు కూడా ఆంక్షలు విధించిన పోలీసులు కూటమి అభ్యర్థులు బూత్‌ల వద్ద ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని పార్టీ అభ్యర్థులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement