సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొదిలి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికలు కూటమి నేతలు, కార్యకర్తలు, దుండగుల, అల్లరి మూకల ఇష్టారాజ్యంగా మారాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న కుట్రతో అధికార టీడీపీ కూటమి నేతలు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడటమే కాకుండా దాడులకు తెగబడ్డారు. మార్కాపురం నుంచి జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, 39 మంది కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్, అలాగే యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో సహా వందలాది మంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పచ్చ గూండాలు 12 వాహనాల్లో వచ్చి పొదిలి పట్టణంలో స్వైర విహారం చేశారు.
ఏజెంట్లపై దాడి..
నందిపాలెం గ్రామంలో టీడీపీకి బలం లేకపోవడంతో ఎలాగైన దుర్మార్గంగా గెలవాలనే లక్ష్యంతో దౌర్జాన్యాలకు తెగబడ్డారు. మార్కాపురం ముఖ్యనేత „ మిగతా 8లో..


