వైఎస్సార్‌ సీపీ నేతల హౌస్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతల హౌస్‌ అరెస్టు

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

కందుకూరు రూరల్‌: కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్‌ సీపీ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూధన్‌యాదవ్‌ను గురువారం ఉదయం హౌస్‌ అరెస్టు చేశారు. ఎన్నికల్లో బయటకు రాకుండా నోటీసులు ఇచ్చి పోలీసులను కాపలా పెట్టారు. అధికార పార్టీ నాయకులు మాత్రం యథేచ్ఛగా పోలింగ్‌ బూత్‌లలో తిరిగేలా పోలీసులు సహకరించారు. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇన్‌చార్జిని బయటకు రానివ్వకపోడం దారుణం. పోలీసులు కూటమికి కొమ్ము కాస్తూ బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను బయటకు రానివ్వకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కందుకూరు ఎన్నికల చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలేదు.

కనిగిరి: వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ను పోలీసులు గురువారం హౌస్‌ అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం హుసేన్‌పురం పంచాయతీ పెరుగుపల్లి స్వగ్రామంలో డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌కు వెలిగండ్ల ఎస్సై, పోలీసులు సిబ్బంది వెళ్లి నోటీసులిచ్చి హౌర్‌ అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే వారి చర్యలు తీసుకోకుండా, పోలీసులు ఏకపక్షంగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన, వైఎస్సార్‌ సీపీ నేతలను గృహనిర్భందం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగరాయకొండ: మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌కు స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎస్సై ఎల్‌ సుధీల్‌కుమార్‌ నోటీసులు ఇచ్చి హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటామనే భయంతోనే హౌస్‌ అరెస్టు చేసి ఇష్టం వచ్చినట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజా తీర్పును అడ్డుకోలేరని, ఇందుకు జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లో సాధించిన విజయాలే కారణమన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

పోలింగ్‌ సమయంలో బయటకు రాకుండా పోలీసులు కాపలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement