రిగ్గింగ్‌ రాజ్యం.. | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌ రాజ్యం..

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

రిగ్గింగ్‌ రాజ్యం.. „ 7వ పేజీ తరువాయి

వచ్చారని ప్రశ్నించి చొక్కాలు పట్టుకుని లాక్కొచి బయటపడేశారు. ఇద్దరు, ముగ్గురిని పట్టుకుని లాక్కురాగానే క్యూలైన్‌లో ఉన్న మిగిలిన దొంగలంతా చెల్లాచెదురుగా పరారయ్యారు. దీనిపై కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్‌ చేయించడం ఇదెక్కడి దారుణమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 31వ వార్డులోని సిద్ధార్ధ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో అధికార పార్టీ నేతలు భారీగా రిగ్గింగ్‌ పాల్పడ్డారు. దీనికి గుడ్లూరు సీఐ రమేష్‌ రక్షణ కల్పించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని సహా, ఏజెంట్‌లను బూత్‌ నుంచి బయటకు పంపించి తలుపులు వేసి మరీ సీఐ రిగ్గింగ్‌ను దగ్గరుండి విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే 12వ వార్డులో ఎన్‌జీఓ హోం పోలింగ్‌ బూత్‌లో పలుకూరు గ్రామం నుంచి తీసుకొచ్చిన వారిని వందల మందిని పోలింగ్‌ కేంద్రంలోకి పంపి రిగ్గింగ్‌ చేయించారు. 33వ వార్డు పశువుల హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌లను బయటకు లాగేసి పోలీసుల సమక్షంలో 200ల నుంచి 300 ఓట్లు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 34వ వార్డు డ్వామా కార్యాలయం బూత్‌లోను ఇదే పరిస్థితి. 6వ వార్డులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఏజెంట్‌లు, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్‌ చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకటీ, రెండు మినహా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోను పోలీసుల రక్షణలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వందల ఓట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

ఓటు వేస్తే కాళ్లు విరగ్గొడతాం...

గిరిజనులకు బెదిరింపులు

ఆనందపురం గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన గిరిజనులు ఓటువేయడానికి వస్తే కాళ్లు విరగొడతాం అంటూ టీడీపీ నాయకులు బుధవారం రాత్రి నుంచే బెదిరింపులకు దిగారు. పైగా వ్యతిరేకంగా ఓటు వేస్తే బియ్యం ఇవ్వం, నీళ్లు వదలం అంటూ హెచ్చరికలు చేశారు. దీంతో భయపడిపోయిన అమాయక గిరిజనులు ఓటు వేసేందుకు సాహసించే పరిస్థితి లేకుండా పోయింది. అయినా ధైర్యం చేసి ఒకరిద్దరు ఓటు వేయడానికి వెళ్తే వారిని చుట్టుముట్టి తన్ని తరిమేశారు. దీంతో మిగిలిన వారు ఓటు వేసే సాహసం చేయడానికి భయపడిపోయారు. రోడ్డుపై నిలబడి తాము ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలంటూ వేడుకున్నారు. ఇదంతా ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ అక్కడికి చేరుకుని వారితో ఓటు వేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement