మాజీ మంత్రి మేరుగు నాగార్జున సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్న ఇనమనమెళ్లూరు కుటుంబాలు
కొత్తపేటలో వైఎస్సార్ సీపీలో చేరుతున్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
మద్దిపాడు: మండలంలోని ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు సోమవారం టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరాయి. మంద ప్రవీణ్‌కుమార్, కొలకలూరి సుబ్బయ్య, గంగవరపు వైద్యనాథ్ విల్సన్, రాయపాటి కార్తీక్, రాయపాటి భగవాన్‌లు వారి కుటుంబాలతో కలిసి వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకున్నారు. వారికి మేరుగు నాగార్జున పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అధ్వానపు పాలనతో విసిగివేసారిన తామంతా వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కార్యక్రమంలో గద్దె జాలయ్య, మద్దినేని శ్రీకాంత్, దుడ్డు వినోద్, ఆకుల శ్రీనివాసరావు, అశోక్‌రెడ్డి, డానియేల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేటలో...
బేస్తవారిపేట: మండలంలోని కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక జంక్షన్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో టీడీపీ ముస్లిం మైనార్టీ నేత షేక్ ముతుజా, దాదాని వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకున్నాయి. వారికి కేపీ నాగార్జునరెడ్డి వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బీవీ రాజయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ బండి శ్రీహరిరెడ్డి, నాయకుడు బండి చెన్నారెడ్డి పాల్గొన్నారు.


