పనిచేసే వారికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

పనిచేసే వారికి ప్రాధాన్యత

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయాలి పార్టీ శ్రేణులకు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున పిలుపు నాయకులకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ

చీమకుర్తి రూరల్‌: అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. శనివారం వైఎస్సార్‌ సీపీ నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. చీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ పదవులు పొందిన ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. పార్టీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా ఇచ్చారు. డాక్టర్‌ మేరుగు నాగార్జున మాట్లాడుతూ నాయకులందరూ సమష్టిగా కృషి చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లమేకల గాంధీ, జిల్లా కార్యదర్శి సోమా శేషాద్రి, మాజీ కౌన్సిలర్‌ బెల్లం వెంకటరావు, మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎస్‌.వెంగారెడ్డి, నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, వాకా కోటిరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, పాలడుగు రాజీవ్‌, వినోద్‌ కుమార్‌, అశోక్‌రెడ్డి, గంగిరెడ్డి సుందరరామరెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement