కందుకూరు: పట్టణంలోని కోటారెడ్డి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పాకల బీచ్ ప్రమాద బాధితుడు బత్తుల నరసింహారావును కలెక్టర్ పి.రాజాబాబు శనివారం సాయంత్రం హాస్పిటల్‌లో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితున్ని అడిగి తెలుసుకున్నారు. నరసింహారావు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ సాకేత్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నరిసింహారావు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ కలెక్టర్‌కు వివరించారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి బాధితుడి ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్ సాకేత్‌ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ వెంట సబ్‌కలెక్టర్ దామెర హిమవంశీ, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి తదితరులు ఉన్నారు.


