సింగరాయకొండ: పాకల బీచ్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లు, బోట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. పాకల బీచ్ వద్ద ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ రాకాసి అల వచ్చి కొంతమందిని సముద్రంలోకి లాక్కెళ్లిందని, అయితే మత్స్యకారులు, మైరెన్ పోలీసులు సకాలంలో స్పందించి కొంతమందిని కాపాడారన్నారు. గల్లంతైన వారి కోసం సాంకేతిక సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ వై శ్రీహరి, మైరెన్ సీఐ శివన్నారాయణ, ఎస్సై ఎల్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.


