న్యూస్‌రీల్
ఏడాదికోసారి స్వగ్రామానికి చేరి పండుగలు, సంప్రదాయ వేడుకలతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం అలముకుంది. పొట్టచేత పట్టుకుని వలస బాట పట్టేందుకు సిద్ధమైన వారు.. అంతలోపే సముద్ర స్నానానికి వెళ్లి మృత్యుఒడికి చేరడం ఆ కాలనీలో తీరని శోకాన్ని నింపింది. ఉదయం వరకు కళ్లముందే తిరిగిన తమ వారంతా సముద్రంలో రాకాసి అల ధాటికి గల్లంతయ్యారన్న వార్తతో ఆ కుటుంబాలు విలపిస్తున్నాయి. కళ్లముందే పెరిగిన వారు విగతజీవులయ్యారన్న వార్తతో శ్రీరంగాపురం ఇరిగినేని కాలనీ కన్నీరుమున్నీరవుతోంది.


