న్యూస్‌రీల్
సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని చంద్రబాబు గెలిచిన తర్వాత కూడా నామమాత్రంగా నామినేటెడ్ పదవులు రుణాల పేరుతో బీసీలను దగా చేసిన వైనం రెండేళ్లలో ఒక్క బీసీకి కూడా ఉద్యోగం ఇవ్వని కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు కోర్టులో నిలబడదని తెలిసీ బీసీలను మాయ చేసేందుకు కుట్రలు
గేదెల చోరీ కలకలం
కంభం, అర్ధవీడు మండలాల్లో గత మూడు నెలల్లో 80కిపైగా గేదెలు అపహరణకు గురవడంతో పాడి రైతులు, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు చేసిన డ్రామాలకు సుప్రీంకోర్టు తెరదించింది. సార్వత్రిక ఎన్నికల నుంచే బీసీలకు ఆయన వెన్నుపోటు పొడవడం ప్రారంభించారు. రెండున్నరేళ్లు కూటమి పాలనలో జిల్లాలో ఉద్యోగాలు, నామినేటెడ్ పదవులు, రుణాల హామీలు అమలుకు నోచుకోలేదని బీసీలు మండిపడుతున్నారు. మరోవైపు దాడుల బాధితులకు న్యాయం చేయకుండా ఆందోళనకారులపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, రక్షణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీసీల ఓట్లు..
దగా చేసెనారా.!


