కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు గతంలో ప్రకటించడం, జీఓలు జారీ చేయడం అంతా నాటకం. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టం చేయించాలి. కానీ, పార్లమెంటులో బిల్లు పెట్టకుండా జీఓలు జారీ చేస్తే కోర్టులో కేసు నిలబడదని ముందే తెలిసి కూడా నాటకాలాడారు. బీసీల ఓట్ల కోసం కట్టుకథలు అల్లుతున్నాడు. ఓసీలు పోటీ చేసే స్థానాల్లో బీసీలకు కేటాయించి తన చిత్తశుద్ధిని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు.
– మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్


