చిత్రలేఖనంలో జాతీయ పురస్కారానికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

చిత్రలేఖనంలో జాతీయ పురస్కారానికి ఎంపిక

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

చిత్రలేఖనంలో జాతీయ పురస్కారానికి ఎంపిక జ్ఞానేశ్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలి ● నేడు వామపక్షాల ధర్నా

నాగులుప్పలపాడు: మండలంలోని ఒమ్మెవరం గ్రామానికి చెందిన పిన్నింటి భవ్య చిత్రలేఖనంలో జాతీయ పురస్కారానికి ఎంపికై ంది. ఆంధ్రప్రదేశ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25న విశాఖపట్నంలో నిర్వహించనున్న కార్యక్రమంలో చిత్రలేఖనం విభాగంలో పిన్నింటి భవ్యకు జాతీయ పురస్కారం అందజేయనున్నట్లు ఆహ్వానం అందింది. చిత్రలేఖనం రంగంలో భవ్య సాధిస్తున్న ప్రతిభ, కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ మచవరం గౌరీశంకర్‌ తెలిపారు.

ఒంగోలు టౌన్‌: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీల నాయకులు తెలిపారు. ధర్నాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, యువజనులు, ముస్లిం, మైనార్టీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష నేతలు మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నియామక విధానంలో మార్పులు తీసుకొచ్చి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించుకునే పరిస్థితి కల్పించారని విమర్శించారు. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఇద్దరు సభ్యులు వ్యతిరేకించిన అంశాలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో జరుగుతున్న ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని, ప్రాంతీయ పార్టీల ఓట్ల శాతాన్ని తగ్గించి బీజేపీకి లబ్ధిచేకూర్చేలా సాగుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. సాధారణంగా ఏటా జరిగే ఓటర్ల జాబితా సవరణలో మరణించిన వారి పేర్లు తొలగించి కొత్తగా అర్హత పొందిన వారిని చేర్చుతారని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియను పక్కనపెట్టి ప్రత్యేక సవరణ పేరుతో ఓటు హక్కు పొందడం కష్టతరం చేస్తున్నారన్నారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఆర్‌.వెంకట్రావు, ఎస్‌కే మాబు, నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు, చీకటి శ్రీనివాసరావు, టీ ప్రభాకర్‌, జి.సుబ్బారెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా నాయకురాలు లలితకుమారి, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఆర్‌.మోహన్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement