గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం వైఎస్సార్ సీపీ శ్రేణులకు మేరుగు నాగార్జున పిలుపు
నాగులుప్పలపాడు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో, మండలంలో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన నాగులుప్పలపాడు మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ నిర్ణయాలను తాము కూడా గౌరవిస్తూ ముందుకు సాగుతామన్నారు. ఇకపై గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి అందరం జగనన్న కోసం నిలబడాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన భరోసాతో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్‌లో సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండాను రెపరెపలాడించాలన్నారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, నాయకులు పోలినేని కోటేశ్వరరావు, కొంజేటి సురేష్, మాదాసు రాంబాబు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, ఉప్పుగుండూరి శ్రీనివాస ప్రసాద్, పేరాల చెన్నకేశవులు, కాటూరి ఆదియ్య, ఇమ్మిశెట్టి బాలకృష్ణ, పాదర్తి శివ, పొట్టేటి అశోక్, పొద పవన్, కుందా లింగేష్, కొలకలూరి విజయ్ కుమార్, పాలపర్తి ప్రవీణ్, కందుల డానియేలు, పక్కెల వజ్రంబాబు, గండ్ర రమణారెడ్డి, వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఆశావహులు ముందుకు రావాలి...
మద్దిపాడు: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, పోటీ చేయాలనుకునే ఆశావహులు ముందుకు రావాలని, వారి పేర్లను రాష్ట్ర నాయకత్వానికి పంపుతామని మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మద్దిపాడులోని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మద్దిపాడు మండలంలోని నాయకులకు నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఎక్కడా ఏకగ్రీవం కాకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పాకనాటి మహానందరెడ్డి, రజని, దుడ్డు వినోద్, సన్నపురెడ్డి రవణమ్మ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మోరబోయిన సంజీవరావు, మాజీ ఎంపీపీ నారా విజయలక్ష్మి, బొమ్మల రామాంజనేయులు, నాదెండ్ల మహేష్, గుడ్డపాతల రవి, పల్లకి సత్యన్నారాయణ, పల్లపాటి అన్వేష్, తదితర జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు


