ఇంటూరి యాదవ వ్యతిరేకి.. | - | Sakshi
Sakshi News home page

ఇంటూరి యాదవ వ్యతిరేకి..

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చర్యలు నిరశిస్తూ యాదవుల మహా ధర్నా మాజీ కౌన్సిలర్‌పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్‌

ఒంగోలువన్‌టౌన్‌: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు యాదవ వ్యతిరేక చర్యలను నిరశిస్తూ యాదవ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కందుకూరులో మాజీ కౌన్సిలర్‌ దాసరి మాల్యాద్రి, అతని కుమారునిపై అక్రమ ఎీస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతోనే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పారు. రాజకీయ కారణాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, ఇలా అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. అలాగే లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఇతర కులాలను రెచ్చగొట్టి అధికారులను అడ్డుపెట్టుకొని యాదవులు గంగమ్మ జాతర జరుపుకోకుండా చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే ప్రజలందరికీ అని.. కేవలం తెలుగుదేశం వారికి మాత్రమే కాదని గుర్తించాలన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన ఇంటూరి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆనందం పొందటం మంచిది పద్ధతి కాదని హితవు పలికారు. బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా హరి మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని.. మంచి పరిపాలన చేస్తాడని ఇంటూరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇలా కులాల మధ్య గొడవలు పెట్టి, అక్రమ కేసులు పెట్టి బెదిరించడం తగదన్నారు. మాజీ కౌన్సిలర్‌ దాసరి మాల్యాద్రి, అతని కుమారునిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అన్నెబోయిన పల్లె గ్రామంలో గంగమ్మ జాతర యాదవ కులాచారాల ప్రకారం జరిపించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ ఇంటూరి నాగేశ్వరరావు యాదవులపై కక్ష కట్టారని, కందుకూరు నియోజకవర్గంలో 30 వేల మంది యాదవ ఓటర్లు ఉన్నారని ఆ నియోజకవర్గంలో ఉన్న యాదవులందరూ నీమీద కక్ష కడితే నీవు తట్టుకోలేవని హెచ్చరించారు. కార్యక్రమంలో చావలి సుధాకర్‌, పెన్నా కృష్ణయ్య, చీమల రాజా, మద్దసాని నవీన్‌, అమ్మనబోయిన మాధవ, గొర్ల రమేష్‌, ఈర్ల వెంకటేశ్వర్లు, గంజి మాధవ, సన్న విజ్ఞాన్‌, అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, చిత్తారి మాధవ, కొత్త గొర్ల నరసింహారావు, ఎల్లావుల మురళీకృష్ణ, నగళ్ల నారయ్య, కుంభాల క్రాంతి కుమార్‌, అప్పనబోయిన రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement