అర్హుల ఓట్లు ఉండేలా బీఎల్‌ఏలు పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు ఉండేలా బీఎల్‌ఏలు పనిచేయాలి

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి, ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దద్దాల

పామూరు: సర్‌ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దద్దాల నారాయణయాదవ్‌ అన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి సోమవారం వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, ఇన్‌చార్జ్‌ దద్దాల మండలపార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా సర్‌ ప్రక్రియ, ఓటర్ల జాబితా ఇతర విషయాలపై స్థానిక నాయకులతో చర్చించారు. ఎన్యుమరేషన్‌ అనంతరం వచ్చిన జాబితాను పరిశీలించి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఓట్లను నిశితంగా పరిశీలించి వారు ఓటుకు అర్హులై ఉంటే తగు ధ్రువీకరణ పత్రాలు బీఎల్‌ఓలకు అందజేసి ఓటు తొలగింపునకు గురికాకుండా చూడాలన్నారు. నూతన ఓటర్లకు దరఖాస్తు చేయించాలని సూచించారు. అనంతరం బూచేపల్లి, ఇన్‌చార్జ్‌ దద్దాలను మండల పార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి పలువురు ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎస్‌పురం కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌.మహబు గృహప్రవేశ కార్యక్రమానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బయ్య, కోఆప్షన్‌ షేక్‌.నాయబ్‌రసూల్‌, టీచర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామిరెడ్డి, అంబటి కొండారెడ్డి, మైనారిటీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌.గయాజ్‌, యూత్‌ మండల అధ్యక్షుడు ఇర్రి కృష్ణారెడ్డి, ఎస్టీసెల్‌ శ్రీరామ శ్రీనివాసులు, కందుల శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ షేక్‌.అబ్దుల్‌, యాటా రాఘవేంద్ర, తుపాకుల ఆంజనేయరెడ్డి, ఎలికా అచ్చయ్య, కోడూరి రామసుబ్బారెడ్డి, మాలెం అంజిరెడ్డి, కోడూరి రామసుబ్బారెడ్డి, కొత్తూరి రవిబాబు, సుబ్రమణ్యం, సూరిబాబు, మర్రి రాజుయాదవ్‌, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement