ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026 – 8లో.. ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వంలో వేట కోల్పోయిన మత్స్యకారులకు ఒక ఏడాదికి సంబంధించిన భృతిని పూర్తిగా చెల్లించారు. ఆ తరువాత ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక కుటుంబానికి ఏడాదికి రూ.36 వేల చొప్పున నాలుగేళ్లకు రూ.1.44 లక్షలు రావాల్సి ఉంది. దీనిపై అనేకసార్లు అధికారులను అడిగినా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వం వెంటనే భృతికి సంబంధించిన డబ్బులు చెల్లించాలి.
– చేపల బాలాజీ, కర్లపాలెం మత్స్యకారుడు మా గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించడంతో ఇళ్లు, పొలాలు అన్ని పూర్తిగా కోల్పోయాం. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఏళ్లుగా జీవన భృతిగా ఉన్న చేపల వేట సక్రమంగా సాగే పరిస్థితి లేదు. జెట్టి నిర్మిస్తామని చెప్పారు.. అదీ చేయలేదు. వేట లేనందున ఆసరాగా ఉండేందుకు ప్రతి ఏడాది కొంత డబ్బులు ఇస్తామని చెప్పారు.. అవీ ఇవ్వడం లేదు. దీని వల్ల జీవనం సాగక ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇస్తామన్న డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– కొండూరు సుధాకర్, మత్స్యకారుడు, మొండివారిపాలెం పోర్టు నిర్మాణంతో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో మత్స్యకారుల భృతిని కూడా చెల్లించింది. కానీ కూటమి ప్రభుత్వం భృతి నిధులు విడుదల చేయకపోవడం దుర్మార్గం. పైగా పోర్టును ప్రైవేటీకరిస్తామని చెప్తోంది. అయితే వచ్చే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోర్టును తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావడంతో పాటు, నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు చర్యలు తీసుకుంటాం.
– బుర్రా మధుసూదన్‌యాదవ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుడ్లూరు మండలం మొండివారిపాలెం పరిధిలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.4,929 కోట్ల ఖర్చుతో 850 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పోర్టు పరిధిలోకి వచ్చే మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ మూడు గ్రామాల్లో అధికంగా మత్స్యకారులు నివశిస్తారు. వీరంతా సముద్రంపై చేపల వేట సాగించి జీవనం సాగిస్తుంటారు. పోర్టు నిర్మాణం వల్ల వీరి ఉపాధి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. వీరిని ఆదుకునేందుకు అప్పటి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వమే పూర్తి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద కాలనీలను కట్టించడంతో పాటు, ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులను కొంత కాలం ఆదుకునేందుకు ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.3 వేలు చొప్పున భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.36 వేలు భృతి కింద చెల్లించాల్సి ఉంది.
మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాల పరిధిలో 585 మంది మత్స్యకార కుటుంబాలను ఈ భృతికి అర్హులుగా గుర్తించారు. వీరికి సంబంధించిన భృతిని గత ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో కలిపి ఒక ఏడాదికి సంబంధించిన నిధులను పూర్తిగా విడుదల చేసింది. భృతి కింద దాదాపు రూ.2.10 కోట్ల నిధులను మత్స్యకారులకు చెల్లించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ భృతి గురించి పూర్తిగా మర్చిపోయింది. దాదాపు నాలుగు సంవత్సరాలకు సంబంధించి భృతి బకాయిలు రూ.8.42 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ బకాయిల గురించి ఎవర్ని అడగాలో కూడా మత్స్యకారులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే 2021లోనే భృతికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి కనీసం ఐదు సంవత్సరాల పాటు భృతి ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. 2021లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఒక యూనిట్‌గా తీసుకుని భృతి చెల్లిస్తామనే హామీ ఇచ్చారు. 2021లో 585 మందిని గుర్తించినా, తిరిగి సర్వే నిర్వహించి మేజర్లు అయిన వారిని గుర్తించడం లేదని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ప్రస్తుతం నిర్వాసిత గ్రామాల్లో అనేక మంది 18 ఏళ్లు నిండిన వారు ఉన్నా ప్రస్తుతం వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఐదేళ్ల పాటు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఒక ఏడాది మాత్రమే ఇచ్చి చేతులెత్తేశారు.
పోర్టు నిర్మాణం ప్రాంతంలోని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలించారు. కర్లపాలెం గ్రామానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీని వల్ల ఈ మూడు గ్రామాల్లోని మత్స్యకారుల ప్రధాన వృత్తి అయిన చేపల వేట పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో ప్రభుత్వం వీరికి ఉపాధి దెబ్బతినకుండా ఒక జెట్టి నిర్మించి ఇస్తామని, మెరుగైన ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. అప్పటి వరకు భృతి కింద కొంత డబ్బులు ఇవ్వాలనేది ప్రతిపాదన. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ఈ రెండూ లేకుండా పోయాయి. అటు భృతికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోగా, జెట్టి నిర్మాణం ఎప్పటికి చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో అటు భృతి డబ్బులు రాక, ఇటు సాంప్రదాయ వృత్తి చేపల వేట లేక మత్స్యకారులు జీవనం అగమ్యగోచరంగా మారింది.
మత్స్యకారులకు ఇచ్చిన హామీలే అమలు చేయకుండా చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం తాజాగా అసలు రామాయపట్నం పోర్టునే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామంటూ మరో పిడుగులాంటి ప్రకటన జారీ చేసింది. దీంతో పోర్టు నిర్వాసితుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
న్యూస్‌రీల్
రామాయపట్నం పోర్టు నిర్వాసిత మత్స్యకారులకు భృతి చెల్లింపునకు గత ప్రభుత్వం ఉత్తర్వులు
నెలకు రూ.3 వేలు చొప్పున ఏడాదికి రూ.36 వేలు భృతి చెల్లించేలా ఆదేశాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు సకాలంలో నిధులు విడుదల
చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్కపైసా కూడా చెల్లించని వైనం
భృతి బకాయిలు రూ.8.42 కోట్లు పెండింగ్
మూడు గ్రామాల పరిధిలో 585 మంది నిర్వాసిత మత్స్యకార కుటుంబాలకు అన్యాయం
గత ప్రభుత్వంలో భృతి ఇచ్చారు
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రామాయపట్నం పోర్టు నిర్వాసిత మత్స్యకారుల జీవనం అగమ్యగోచరంగా మారింది. పోర్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ఇటు సముద్రంపై ఆధారపడి సాగే వేట దెబ్బతినడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసిత మత్స్యకారులకు చెల్లించాల్సిన భృతిని సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. నాలుగు సంవత్సరాలకు సంబంధించిన భృతి డబ్బులు పెండింగ్ పెట్టి వారి జీవితాలతో ఆటలాడుతోంది. మరోపక్క రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌పరం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో నిర్వాసితుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
వేట లేక ఇబ్బందులు పడుతున్నాం
వేటసాగక..
భృతి రాక..
వచ్చే ప్రభుత్వంలో ప్రతి పైసా చెల్లిస్తాం
కందుకూరు:
మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం కుచ్చుటోపీ
వేట లేక... భృతి రాక ఇక్కట్లు