● కొల్లంవాగు వరకు ప్రయాణించి పనుల పరిశీలన
పెద్దదోర్నాల: మండల పరిధిలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. ప్రత్యేక వాహనంలో సొరంగం ద్వారా కొల్లంవాగుకు చేరుకుని లైనింగ్, టీబీఎం యంత్ర విడిభాగాల తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. నష్టపరిహారం పొందిన నిర్వాసితులను అక్కడ నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ అబూతాలిం, ఈఈ కృష్ణారెడ్డి, మేఘా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
ఉలవపాడు: ఉలవపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక తప్పిపోయినట్లు ఆమె తల్లి ఫిర్యాదు మేరకు మొదట బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ బాలికను అదే గ్రామానికి చెందిన పి.వెంకట్రావు ప్రేమ పేరుతో మోసం చేసి బలవంతంగా తీసుకెళ్లినట్లు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలియడంతో బాలిక స్టేట్‌మెంట్ మేరకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన వెంకట్రావుపై అత్యాచారం, పోక్సో కేసు కింద వెంకట్రావుకు రిమాండ్‌కి తరలించారు. బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి నిరాకరించడంతో ఒంగోలులోని బాలసదన్‌లో చేర్పించామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ ఎస్‌కే.అన్వర్‌బాషా, ఎస్సై సుబ్బారావు ఉన్నారు.


