గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

బండచాకిరి..భద్రత కిరికిరి

గ్రానైట్‌ క్వారీల్లో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే భద్రత వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. నామమాత్రపు ఉత్సవాలు మినహా క్వారీల్లో భద్రత మెరుగుపడటం లేదు.

కేజీ రూ.300కి కొనుగోలు చేయాలి

పొగాకు గరిష్ట ధర కేజీ రూ.300కు కొనుగోలు చేయాలి. అప్పుడే నష్టాలు రాకుండా ఉండగలం. గరిష్ట ధర పెంచేలా కనిష్ట ధర పడిపోకుండా వేలం కేంద్ర అధికారులు చర్యలు తీసుకోవాలి. వేలం కేంద్రంలో వ్యాపారులు రైతుల వద్ద పోటీపడి పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వేలానికి తీసుకొచ్చే అన్ని బేళ్లను సగటు ధరకు కొనుగోలు చేయాలి.

– కిరణ్‌, పొగాకు రైతు, కొండపి మండలం

పొగాకు ధరలు నానాటికీ దిగజారుతున్నాయి. రైతులు ఎన్నో ఆశలతో పొగాకు పంట సాగుచేసి నాణ్యమైన పొగాకు పండించినా తీరా వేలానికి వచ్చేసరికి ధరలు నేలచూపు చూస్తూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. పొగాకు వ్యాపారులు కుమ్మకై ్క గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా, నోబిడ్‌ల పేరుతో అధిక శాతం బేళ్లను తిరస్కరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడుపు మండిన రైతులు తరచూ వేలాన్ని అడ్డుకుని నిరసనలు తెలుపుతున్నా వేలం అధికారులు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి ఊసేపట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement