● 8 మంది అరెస్ట్
కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు గ్రామ పొలాల్లో కోడి పందెం శిబిరంపై బుధ వారం పోలీసులు దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది కలిసి దాడి చేసి కోడి పందెం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కోళ్లు, మూడు సెల్‌ఫోన్లు, మూడు మోటార్ బైకులు, రూ.10,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
జరుగుమల్లి: ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున జరుగుమల్లి మండల పరిధిలోని పాలేరు బ్రిడ్జి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. కొండపి మండలం కె.ఉప్పలపాడుకు చెందిన కూనం శివారెడ్డి (32) రాత్రి ఒంటిగంట సమయంలో ఒంగోలు వైపు వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన శివారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్సై పి.భాగ్యరాజ్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సింగరాయకొండ: స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనం, రిజర్వేషన్ల శాతంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిషన్ బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అర్జీలు స్వీకరించింది. బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించి, తమకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలజ్యోతి, డీఎల్‌డీఓ సువార్తమ్మ, డిప్యూటీ సీఈఓ బాలమ్మ, ఒంగోలు డీఎల్‌పీఓ పద్మ, తహశీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జయమణి తదితర అధికారులు పాల్గొన్నారు.


