బూచేపల్లి కమలాకర్‌రెడ్డికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

బూచేపల్లి కమలాకర్‌రెడ్డికి ఘన నివాళి

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

చీమకుర్తి: సినీ నటుడు, నిర్మాత బూచేపల్లి కమలాకర్‌రెడ్డి జయంతి వేడుకలను బుధవారం చీమకుర్తిలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కమలాకర్‌రెడ్డి సోదరుడు, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, తల్లి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, కమలాకర్‌రెడ్డి కుమారుడు రిలాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేరుగు నాగార్జున హాజరై కమలాకర్‌రెడ్డి స్మారకం వద్ద నివాళులర్పించారు. కమలాకర్‌రెడ్డి పార్కులో ఆయన స్మారకాన్ని పుష్పాలతో అలంకరించి, గజమాలలతో నివాళులర్పించి, కేక్‌ కట్‌ చేశారు. ఈ సంద ర్భంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను బూచేపల్లి కు టుంబ సభ్యులు నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ, రూరల్‌ అధ్యక్షులు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, దుంపా చెంచిరెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, రామసాని పూర్ణచంద్రరావు, బీమన వెంకట్రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement