దిగజారిన నిమ్మ ధర | - | Sakshi
Sakshi News home page

దిగజారిన నిమ్మ ధర

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

హనుమంతునిపాడు: నిమ్మ సాగు చేస్తున్న రైతులు ధరల పతనం కారణంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నాణ్యతను బట్టి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు పలికిన ధర, మే నెల నుంచి అమాంతం పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.10 నుంచి రూ.15కు చేరడంతో రైతులు పెట్టుబడి కూడా రాక లబోదిబోమంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో రెండు నిమ్మకాయలు రూ.10కి అమ్ముతున్నా, కనిగిరి వ్యాపారులు కుమ్మకై ్క రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో నిమ్మ సాగుకు పెట్టింది పేరైన హనుమంతునిపాడు, కనిగిరి, వెలిగండ్ల, సీఎస్‌ పురం, కొనకనమిట్ల మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోసేందుకు కౌలు రైతులు వెనుకాడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిమ్మకు మద్దతు ధర కల్పించి, నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement