సత్తా చాటిన ఆంధ్ర, తమిళనాడు జట్లు
ఉత్సాహంగా 3వ జాతీయ మోడ్రన్ కబడ్డీ పోటీలు పురుషుల విభాగంలో టైగా ఫైనల్ మ్యాచ్ విజేతలుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పురుషుల జట్లు మహిళా విభాగంలో విజేతగా ఆంధ్రప్రదేశ్ జట్టు
సింగరాయకొండ:
స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఆదివారం జాతీయ మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ టై గా ముగియటంతో ఫైనల్స్‌లో ఆడిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు రెండింటినీ విజేతలుగా ప్రకటించారు. మూడో స్థానంలో తమిళనాడు–2, నాల్గవ స్థానంలో తెలంగాణ జట్టు నిలిచాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేత కాగా, రన్నర్‌గా తెలంగాణ జట్టు నిలిచింది. మూడో స్థానంలో కేరళ, నాల్గవ స్థానంలో మహారాష్ట్ర జట్లు నిలిచాయి.
విజేతలకు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్, జనరల్ సెక్రటరీ రామిరెడ్డి షీల్డ్, మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ మార్చిలో తెలంగాణ రాష్ట్రం నల్గొండలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మోడ్రన్ కబడ్డీ పోటీలను ఆరు దేశాలు ఒప్పుకున్నాయని, మరో రెండు దేశాలు ప్రతిపాదనలో ఉన్నాయని వివరించారు. ఈ క్రీడకు అధికారిక క్రీడగా త్వరలో గుర్తింపు తీసుకుని రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాత కబడ్డీ పోటీలో కష్టంతో విజయం సాధించవచ్చని కానీ ఈ మోడ్రన్ కబడ్డీ పోటీలు తెలివితో ఆడాల్సి ఉంటుందని వివరించారు. క్రీడల నిర్వాహకుడు తేళ్ల వంశీకృష్ణ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
సత్తా చాటిన ఆంధ్ర, తమిళనాడు జట్లు


