వైఎస్సార్ సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
పొన్నలూరు: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పొన్నలూరులో ఆదివారం పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత విధ్వంస పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆర్థిక భరోసా, రక్షణ లేకుండా పోతుందన్నారు. చెప్పిన పథకాలు అమలు చేయకుండా చేశానని చెప్పుకుంటూ తన ఎల్లో మీడియాతో డబ్బాకొట్టుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన గాడితప్పిందని, అమాయక ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసులు పెట్టి వేధించడం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకోని లిక్కర్, ఇసుక, మట్టి, గంజాయి మాఫియాగా తయారై రాష్ట్రంలో దోచుకుంటూ, శాంతిభధ్రతలు లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణులు ప్రజా పక్షాన నిలవాలన్నారు. పార్టీ పదవులు పొందిన వారు అలంకారప్రాయంగా ఉండకుండా పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు గడ్డం మాల్యాద్రి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, అనుమోలు ప్రసాద్, గొల్లపూడి రవణయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
వైఎస్సార్ సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి


