ప్రైవేటీకరణతో వైద్యం అందని ద్రాక్షే
మార్కాపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో వైద్యం అందని ద్రాక్ష అవుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల ఇన్‌చార్జిలు, అధ్యక్షులు తాము సేకరించిన కోటి సంతకాల పుస్తకాలను పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ సలీమ్ ద్వారా అన్నా రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ఇది ఎన్నికలకు, పార్టీలకు సంబంధించిన అంశం కాదని, ఇప్పుడు మౌనంగా ఉంటే 66 ఏళ్ల పాటు వైద్య సేవలు ప్రైవేట్‌పరం అవుతాయన్నారు. వైద్యం మరింత ఖరీదై పేదలు ఇబ్బందులు పడతారని చెప్పారు. రాజకీయం చేయడానికో, ఎన్నికల కోసమో.. ప్రజల వద్దకు రావడం లేదని, ప్రజా సంక్షేమం కోసమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాలను పూర్తిచేసిన వార్డు ఇన్‌చార్జిలను, అధ్యక్షులను అన్నా రాంబాబు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాల మురళీకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ జి.శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు జి.శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాచకొండ నాగరాజు, ప్రసాదు, గొంట్ల శ్రీనివాసులు, పి.చిన్న, అయ్యప్ప, వార్డు ఇన్‌చార్జి గుంటక చెన్నారెడ్డి, అధ్యక్షులు ఎస్ తిరుపతిరెడ్డి, జి. లింగారెడ్డి, బ్రహ్మారెడ్డి, శివశంకర్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొనండి
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు


