2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం

Dec 10 2025 9:18 AM | Updated on Dec 10 2025 9:18 AM

2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం

2 కోట్ల సంతకాలకు చేరువగా ప్రజా ఉద్యమం

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి

మార్కాపురం/ మార్కాపురం టౌన్‌: మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల మద్దతుతో ప్రజా ఉద్యమంలా మారి 2 కోట్ల సంతకాలకు చేరువైందని పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మార్కాపురం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నీ వర్గాల ప్రజలకు నష్టం కలిగిందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే విద్య, వైద్య పేదలకు దూరమవుతాయన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాలలు పూర్తయి అందుబాటులోకి వస్తాయన్నారు.

కందులా ఇలా మాట్లాడటం తగునా..

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేస్తుంటే అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడటం తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు అన్నారు. తాను వెంటనే స్పందిస్తే ఈ ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నందున ఇప్పటి వరకూ ఏమీ మాట్లాడలేదన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేసినప్పుడు ఏనాడూ ఎగతాళిగా మాట్లాడలేదని అన్నారు. అధికార పార్టీలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని, అధికార బలంతో, మదంతో మాట్లాడితే సమాజం క్షమించదన్నారు.

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇటీవల విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఇటీవల పొదిలి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, స్టేట్‌ కమిటీ సభ్యులు వెన్నా హనుమారెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, మోర శంకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సలీమ్‌, సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, కొనకనమిట్ల జెడ్పీటీసి అక్కిదాసరి ఏడుకొండలు, ఎంపీపీ మురళీకృష్ణయాదవ్‌, డాక్టర్‌ మగ్బుల్‌ బాషా, సంజీవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు సిరాజ్‌, చాటకొండ చంద్ర, ముంగమూరి శ్రీను, కొత్త కృష్ణ, వార్డు ఇన్‌ఛార్జిలు ఏడుకొండలు, గఫూర్‌, మౌలాలి, గుంటక అంజిరెడ్డి, బొగ్గరపు శేషయ్య, బాలకృష్ణారెడ్డి, కె.ఆది, చిప్స్‌ శ్రీనివాస్‌, పీవీ నాయుడు, కరీముల్లా, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, ఎస్‌ వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, సుబ్బారావు, సీహెచ్‌ వెంకటరామిరెడ్డి, చాటకొండ నాగరాజు, న్యాయవాదులు భూపని కాశయ్య, చౌడేశ్వరరావు, వాల్మీకి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ నల్లబోతుల కొండయ్య సోషల్‌ మీడియా అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement