ఎన్‌జీజీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం
అధ్యక్ష, కార్యదర్శులుగా వరుసగా నాలుగోసారి శరత్, కృష్ణా రెడ్డి
ఒంగోలు సబర్బన్: ఏపీ ఎన్‌జీజీఓ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో వరుసగా నాలుగో సారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కే.శరత్ బాబు, కృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్‌జీఓ హోంలో జిల్లా కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బి.వెంకటేశ్వర్లు ప్రకటించారు. సహాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బి.ఏడుకొండలు, తోట శ్రీనివాసులు, పి.రామాంజనేయులు, బి.విజయ్ కుమార్, ఆర్.దీపక్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా (మహిళ) కె.కోటేశ్వరమ్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.కృష్ణ కిశోర్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు(వాసు), డి.వెంకటేశ్వర్లు, డి.మధుసూదన రెడ్డి, కె.రాజేష్ బాబు, హరిబాబు, సంయుక్త కార్యదర్శిగా (మహిళ) బి.పద్మ కుమారి, కోశాధికారిగా కె.శివ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి రామ్ ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా కార్యదర్శి జీ రామకృష్ణ వ్యవహరించారు. తొలుత కలెక్టరేట్ నుంచి ఎన్‌జీజీఓ అసోసియేషన్ నాయకులు, సభ్యులు భారీ ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్‌తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఎన్‌జీఓ హోం వరకు సాగింది. కమిటీ ఏకగ్రీవం అయిన తరువాత రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్ అసోసియేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాలు, ఉద్యోగుల కోసం చేస్తున్న పోరాటం గురించి మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఎన్‌జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్‌జీజీఓ సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస రావు, రాష్ట్ర ఎన్‌జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జగదీశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ పీ మాధవి ఒంగోలు పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్, కార్యదర్శి షేక్ మగ్దుమ్ షరీఫ్, మహిళా విభాగం చైర్మెన్ కే కోటేశ్వరమ్మ, కన్వీనర్ సీహెచ్ శిరీష, వివిధ డిపార్ట్‌మెంట్స్ అధ్యక్ష కార్యదర్శులు, అన్ని తాలూకా అధ్యక్ష, కార్యదర్శలు, ఉద్యోగులు పాల్గొన్నారు.


