21 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
ఒంగోలు టౌన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23 వరకు కాకినాడ జేఎన్‌టీయులో రాష్ట్ర స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జేవీవీ సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు తెలిపారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో ఆదివారం రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించేందుకే ఏటా సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సంబరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో స్థాయిలో నిర్వహించిన సంబరాల్లో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఇస్రో, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, విద్యా ఆరోగ్య, పర్యావరణ రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. పోటీల్లో విద్యార్థులకు రాత పరీక్షలతో పాటుగా క్విజ్, ఎక్స్ పెరిమెంట్స్ రౌండ్ ఉంటుందన్నారు. ఇస్రో, ఓషినోగ్రఫి, పర్యావరణ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.వెంకటరావు, జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో మూఢనమ్మకాలు నిరోధించేందుకు, ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించేందుకు సైన్సు పట్ల, ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించాలన్న లక్ష్యంతో సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మాలకొండారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం, ఎస్‌వీ రంగారెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలి బ్యాగును పోలీసులు తిరిగి అప్పగించారు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై.మహేష్ కథనం మేరకు వినుకొండకు చెందిన ఓ మహిళా దైవదర్శనం నిమిత్తం శ్రీశైల పుణ్యక్షేత్రానికి బయలుదేరింది. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో లగేజీ బ్యాగును పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..వాహన తనిఖీలు చేసిన పోలీసులు పోగొట్టుకున్న ప్రయాణికురాలి బ్యాగును తిరిగి అప్పజెప్పారు.
21 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు


