
కలెక్టరేట్‌లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూం
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం భవనంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాలను కలెక్టర్ పీ రాజాబాబు శుక్రవారం రాత్రి పరిశీలించారు. కలెక్టరేట్‌లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం పీజీఆర్‌ఎస్ మీకోసం హాలు, ఆడిట్ టీము, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ విభాగం పనిచేస్తున్న కార్యాలయాలను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్‌ఓ బీ చిన ఓబులేసులతో కలిసి తనిఖీ చేశారు. వీరి వెంట కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఉన్నారు.
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో తాగునీటి పరఫరా తీరును డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెనకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రాంనగర్, సంతపేట, అన్నవరప్పాడు తదితర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా అవుతున్న ఎస్‌ఎస్–2 ట్యాంక్ పరిధిలోని ప్రాంతాలను మునిసిపల్ ఇంజినీర్ యేసయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీరు ప్రసుత్తం పరిశుభ్రంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించామని డీఎంహెచ్‌ఓ చెప్పారు. నగరంలో తాగునీరు పైపులు లీకేజి ఉంటే వెంటనే వాటిని మరమ్మతులు చేసి ప్రజలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని మునిసిపల్ ఇంజినీర్‌కు సూచించారు.

కలెక్టరేట్‌లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూం