
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఒంగోలు సబర్బన్: స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయమని కలెక్టర్ పీ.రాజాబాబు అన్నారు. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఏ షాపులో, ఏ సమయంలో రేషన్ సరుకులు తీసుకున్నారో ట్రేస్ చేయవచ్చన్నారు. కార్డు పోయినా జిరాక్స్ కాపీతో కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,51,818 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి 1392 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని డీఎస్‌ఓ పద్మశ్రీ తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.వెంకట్రావు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ సుజాత, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సింగరాయకొండ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం అండర్–19 బాల బాలికల జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. జూనియర్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ కే శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెలక్టర్లుగా జే ప్రభాకర్, నామా చంద్రశేఖర్, ఏ కిరణ్‌కుమార్, పీ రమేష్, సయ్యద్ జంషీర్ అబ్దాల్ పాల్గొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ