విషతుల్యం | - | Sakshi
Sakshi News home page

విషతుల్యం

Oct 13 2025 9:04 AM | Updated on Oct 13 2025 9:04 AM

విషతు

విషతుల్యం

ఫిల్టర్‌ చేయకుండా నేరుగా తరలిస్తున్న సాగర్‌ జలాలు దుర్వాసన వెదజల్లుతున్న తాగునీరు బ్లీచింగ్‌ కూడా వేయకుండానే సరఫరా పట్టించుకోని పాలకులు, అధికారులు దర్శి ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా నాలుగు మండలాలకు నీటి సరఫరా కనీస నిబంధనలు పాటించని కాంట్రాక్టర్‌

కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లక్షలాది మందికి నీటి సరఫరా చేసే విషయంలో కాసులకు కక్కుర్తి పడి కలుషిత జలాలతో జనాలను అనారోగ్యం పాలుచేస్తున్నారు. రక్షిత మంచినీరు బదులు మురుగునీటిని సరఫరా చేస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాణజలం..

దర్శి:

ర్శి పట్టణం నుంచి దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు చెందిన ప్రజలకు నిత్యం సాగర్‌ జలాలు సరఫరా చేసేందుకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఎన్‌ఏపీ (నెదర్లాండ్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌) సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును నిర్మించారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. సాగర్‌ కాలువ నుంచి వచ్చే జలాలను స్టోరేజ్‌ ట్యాంకుకు మోటార్ల ద్వారా సరఫరా చేసి వాటిని శుద్ది చేసి నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు చేశారు. ప్రారంభంలో దీని ద్వారా దర్శి, కనిగిరి, పొదిలి ప్రాంతాలకు నిత్యం రెండు లక్షల మందికి తాగునీరు అందించేవారు. 930 మీటర్ల మట్టికట్టతో 2538 మిలియన్‌ లీటర్ల పరిమాణం కలిగిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేసేందుకు 7 శాండ్‌ ఫిల్టర్‌ బెడ్‌లు ఏర్పాటు చేశారు. 5 లక్షల లీటర్ల నీటి పరిమాణం కలిగిన క్లియర్‌ వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను కూడా నిర్మించారు. ఫిల్టర్‌ బెడ్‌లలో శుద్ధి చేసిన జలాలను నేరుగా క్లియర్‌ వాటర్‌ ట్యాంక్‌లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో దర్శి, పొదిలి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలకు నీటిని పంపేవారు. తర్వాత మర్రిపూడి, కనిగిరి మండలాలకు సైతం నీటిని సరఫరా చేశారు. ఈ నీటిని సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించేవారు. కాంట్రాక్టు పొందిన వ్యక్తి నీటిని క్రమం తప్పకుండా శుద్ధి చేసి పంపిణీ చేయాల్సి ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా అంతా సక్రమంగా జరిగింది. రోజు విడిచి రోజు నీటిని పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. అంతేకాకుండా నీటి శుద్ధి చేయకుండా సరఫరా చేస్తున్నారు.

సాగర్‌ కాలువ కట్టపై ఉన్న డంపింగ్‌ మురుగు వర్షాలకు సాగర్‌ కాలువలోకి చేరుతోంది. ఆ నీటినే నేరుగా మంచినీటి రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తున్నానని, ఆ నీటిని కనీసం శుద్ధి చేయకుండా అలాగే నేరుగా క్లియర్‌ వాటర్‌ ట్యాంక్‌కు సరఫరా అవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిల్టర్‌ చేయకుండా నేరుగా నీటిని సరఫరా చేస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేయలేక సాగర్‌ జలాలు వాసన వస్తున్నా గత్యంతరం లేక ఆ నీటిని తాగాల్సి వస్తోందని వాపోతున్నారు.

టెండర్ల దశలోనే తిరకాసు..

గత ప్రభుత్వంలో ఈ నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టరు ద్వారా నీటిని సరఫరా చేసే వారు. నీటి పంపిణీకి సంబంధించి దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులకు విడివిడిగా టెండర్లు పిలిచేవారు. దర్శికి సంబంధించి రూ.2 కోట్లు, తాళ్లూరు మండలానికి రూ.76.5 లక్షలు, ముండ్లమూరు మండలానికి రూ.98 లక్షలు చెల్లించేలా టెండర్లను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పిలిచేవారు. మొత్తంగా రూ.3.735 కోట్లకు సంబంధించిన టెండర్లను వైఎస్సార్‌ సీపీ హయాంలో 30 శాతం తక్కువకు టెండర్‌ వేసేవారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ నీటిని శుద్ధి చేస్తూ రోజు విడిచి రోజు నీటిని అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టెండర్ల దశలో అంతా గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరూ పోటీకి రాకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కేవలం ఒక శాతం తక్కువ కోడ్‌ చేసి దక్కించుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. అయితే తాను చేసే పనిలో అధిక మొత్తంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధికి భారీగా నజరానా చెల్లించాడని సమాచారం. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వ్యక్తి నీటి సరఫరాకు సంబంధించి కనీస నిబంధనలు పాటించడంలేదని తెలుస్తోంది. నీటిని శుద్ధి చేయడంలేదని, కనీసం బ్లీచింగ్‌ కూడా వేయకుండా అలాగే సాగర్‌ జలాలు గ్రామాలకు మురుగు నీరుగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పురుగులను నిర్మూలించేందుకు గ్యాస్‌ లేదా బ్లీచింగ్‌ కూడా నీటిలో కలుపకుండా అలాగే సరఫరా చేయడంతో అందులో పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టిమట్టిగా నీరు రావడమే కాకుండా దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. నిండుగా నీరున్నా వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఫలితంగా తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలుషిత నీరు వస్తున్నా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్‌ఏపీ రిజర్వాయర్‌

విషతుల్యం1
1/6

విషతుల్యం

విషతుల్యం2
2/6

విషతుల్యం

విషతుల్యం3
3/6

విషతుల్యం

విషతుల్యం4
4/6

విషతుల్యం

విషతుల్యం5
5/6

విషతుల్యం

విషతుల్యం6
6/6

విషతుల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement