
జూనియర్ చాంబర్ అధ్యక్షుడిగా శబరీనాథ్
ఒంగోలు టౌన్: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఛాప్టర్ అధ్యక్షుడిగా పి.శబరీనాథ్ నాయర్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కె.వీరబ్రహ్మం, కోశాధికారిగా జె.శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మాంటిస్సోరి స్కూల్‌లో జూనియర్ చాంబర్ వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో 2026వ సంవత్సరానికి గాను నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోనంకి వరుణ్ కుమార్, పి.రామాంజనేయులు, ఏడుకొండలు, శ్రీరాములు రెడ్డి, నాగేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సమావేశంలో జేసీఐ పూర్వాధ్యక్షులు టి.రవికుమార్, కనకారావు, అద్దంకి శ్రీనివాసరావు, వివి రమణ, ఇస్మాయిల్, ఈపూరి శివప్రసాద్, ఆంద్ర శ్రీనివాసరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలు మంగమూరు రోడ్డులో బైపాస్ వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి నెలా ఒక నియోజకవర్గంలో జిల్లా కమిటీ, స్థానిక సంఘీయులతో చర్చించి స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు చెరిగిచర్ల ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు పులివర్తి సాయిబాబా, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి పావులూరు బ్రాహ్మణచారి, కీనల శ్రీనివాసచారి, సన్నమూరి వీరబ్రహ్మం, పదిరి ఆదినారాయణ, చెరుకూరి ఓంకార చారి, పచ్చవ సుబ్రహ్మణ్యం, వేల్పూరి రామారావు, రాచకుళ్ళ రవికుమార్, పోతులూరి వీరబ్రహ్మం, మునిగంటి వెంకటేశ్వరచారి, పోతులూరి శివ, బ్రహ్మచారి, మునగంటి విశ్వరూపచారి, అలుగుపల్లి శ్రీనివాసచారి, గోనుగుంట దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ చాంబర్ అధ్యక్షుడిగా శబరీనాథ్