
పేదోళ్ల ఆరోగ్యాన్ని దూరం చేసేందుకు కుట్ర
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: పేద వర్గాల ఆరోగ్యం, వారి బిడ్డల వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నిందని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగనన్న తన పాలనలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని, వాటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లలేక తమ ప్రాణాలు కోల్పోతున్నారన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి తీసుకొచ్చారని చెప్పారు. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని నిర్వహణ కొనసాగుతోందని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు పేదల రక్తాన్ని పీల్చి దోచుకోవటానికి తమ అనుచరులకు ఆ కళాశాలలను అప్పనంగా అప్పచెప్పేందుకు పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. దీనివలన పేద, మధ్య తరగతి కుటుంబీకులు వైద్యం చేయించుకోలేని పరిస్థితిని తీసుకొస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు మంజూరు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన దుర్మార్గపు సీఎం చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. కూటమి నాయకులు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తమ జేబులు నింపుకోవటానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, మెడికల్ కళాశాలలను చిల్లర డబ్బులకు లీజుకు ఇచ్చి తాము రూ.కోట్లల్లో దోచుకొని దాచుకోవటానికే పీపీపీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని ఆయన కోరారు.
ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్, ఆళ్ల సుబ్బమ్మ ఆంజనేయరెడ్డి, గుమ్మా పద్మజ ఎల్లేష్ యాదవ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, ఆర్.వాగ్యానాయక్, పార్టీ మండల కన్వీనర్‌లు గంటా వెంకట రమణారెడ్డి, దోమకాళ్ల వెంకటేశ్వర్లు, పి.కృష్ణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఉడుముల అరుణ, ఆర్.అరుణాబాయి, పొన్న వెంకటలక్ష్మి, పల్లె సరళ, జి.శార, కె.ఓబులరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఒంటేరు నాగేశ్వరరావు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, ఎల్.రాములు, లాలు నాయక్, షేక్.షెక్షావలి, చిట్టేల వెంకటేశ్వరరెడ్డి, సన్నెపోగు సుందరరాజు, పి.రాములు నాయక్, టి.సత్యనారాయణరెడ్డి, కోటిరెడ్డి, దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, ఎస్.ప్రసాద్, బి.బాలచెన్నయ్య పాల్గొన్నారు.

పేదోళ్ల ఆరోగ్యాన్ని దూరం చేసేందుకు కుట్ర