
సంతకాల సేకరణ విజయవంతం చేయండి
ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: గ్రామస్థాయిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలపై చర్చించారు. అక్టోబరు 28 న నియోజకవర్గాల్లో ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన అనంతరం నవంబరు 26 గవర్నర్‌కు సమర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.