
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బాలినేని
ఒంగోలు సెంట్రల్: దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సభ కరపత్రాలను శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేడ్కర్ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బాలినేని అన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు అంకితం చేయనున్నట్లు పేర్కొన్నారు. దళిత ఉద్యమ నాయకులు చప్పిడి వెంగళరావు, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుబ్బారావు, దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పట్రా బంగారం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ బాధ్యులు తెలిపారు.