సాక్షి, నగరి: మహానాడులో టీడీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ అసహ్యంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కాలిగోటికి సరిపోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడును టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు తెలిసిపోయింది. మహానాడులో టీడీపీ నేతలవి బోగస్ మాటలేనని మాటలకు అర్థమైంది. మహానాడులో వైఎస్ జగన్ నామస్మరణే ఎక్కువ చేశారు. వైఎస్ జగన్ అంటే టీడీపీ నేత వెన్నులో వణుకుపుడుతుంది. మహానాడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టి సభకు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు డిన్నర్ చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని కలిసిన మీరు మహిళా ద్రోహులు.
ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. దేశంలో ఏపీ పోలీసుల ర్యాంక్ అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. ఒక్కొక్కరు ముగ్గురు, నలుగురు కనాలని చంద్రబాబు చెబుతున్నారు. మహిళలు పిల్లల్ని కనాలని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?. కాంగ్రెస్‌తో టీడీపీకి హాట్‌లైన్ బంధం ఉందని వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు. దమ్ముంటే మహిళా బిల్లుకు మద్దతుగా మహానాడులో తీర్మానం చేయండి. మహానాడులో వైఎస్ జగన్ గురించి నీచంగా మాట్లాడారు. సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు?. హరికృష్ణ శవం దగ్గర పొత్తులపై కేటీఆర్‌తో మాట్లాడిన మీరు సైకో కాదా?. నారా లోకేష్ బిల్డప్ మాటలు ఎందుకు?. జగన్ దెబ్బకు లోకేష్ ఢిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. ఓటమి ఎరుగని ధీరుడు జగనన్న. నువ్వు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు. వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్రజ సమస్యలు ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తుల్లో తల్లీ, చెల్లికి ఎంతిచ్చారో చెబుతారా?.
మోసాలు, వెన్నుపోటుతో చంద్రబాబు సీఎం స్థాయి ఎదిగారు. తన చెల్లికి జగనన్న ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు. అసలు గొడ్డలి పార్టీ మీది. హెరిటేజ్ ఆస్తుల్లో మీ నాయకుడు తల్లి, చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్తారా?. తల్లితో ఉన్న ఫోటో గానీ, చెల్లితో ఉన్న ఫోటో ఒక్కటైనా బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన మీరు సైకోలు కాదా?. వివేకా హత్య చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు సునీత, షర్మిల అడగలేదు. హత్య చేసిన దస్తగిరికి కొమ్ము కాస్తున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు.
మంత్రి అనిత.. సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఆమెకు న్యాయం చేయాలి. మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు, మహిళలు కు ముందు రక్షణ కల్పించాలి. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. వెన్నుపోటు రెండేళ్లు పేరుతో విడుదల చేసిన బుక్ లెట్ ప్రతి గడప గడపకు అందిస్తాం’ అని అన్నారు.


