ఏపీలో మహిళలకు భదత్ర ఏది?: వరుదు కల్యాణి | Ysrcp Leader Varudu Kalyani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీలో మహిళలకు భదత్ర ఏది?: వరుదు కల్యాణి

Oct 5 2024 2:11 PM | Updated on Oct 5 2024 6:52 PM

Ysrcp Leader Varudu Kalyani Comments On Chandrababu

ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నాయన్నారు.

‘‘పుంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైంది. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ మహిళకు లేదా?. హోం మంత్రి అనితా నియోజకవర్గంలో మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆడ పిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఐదు నెలల చిన్న పిల్లలపై కూడా లైంగికదాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలు పై జరుగుతున్న హత్యలు, లైంగికకదాడులపై ఎందుకు పవన్ ప్రశ్నించలేదు’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.

ఇదీ చదవండి: కట్టుకథల బాబూ.. విష ప్రచారం ఆపు: కురసాల కన్నబాబు

Advertisement
 
Advertisement
Advertisement