
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంతో రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిన్నంటికీ తాళాలు వేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనం మొదలు అమ్మేవరకూ పూర్తి భరోసా ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం క్యూలైన్‌లో ఉండి ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు.ప్రభుత్వ తరుపున కట్టే ఇన్సురెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు.
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాలో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డివో కార్యలయంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.
వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తారీఖున ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల పైన వినత పత్రాన్ని అందజస్తామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలపై మొద్దు నిద్ర వహిస్తుందన్నారు.