రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు
భీమవరం (ప్రకాశంచౌక్): రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం, గునుపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం–1లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై మంగళవారం ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా ఏ విధమైన సేవలు ప్రజలకు అందుతాయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి సంబంధిత అంశాలను ఈ సదస్సుల ద్వారా వివరిస్తారన్నారు. భీమవరం గునుపూడి గ్రామంలోని ఇళ్ళు, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే పన్ను రసీదు మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు ప్రమేయం లేకుండా స్వయంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా ఈ అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకోవాలన్నారు.
భీమవరం: జిల్లాలో ఏపీ టెట్ పరీక్షకు మంగళవారం 89.65 శాతం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. జిల్లాలో రెండు షిప్ట్‌ల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించగా 734 మందికి 658 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్‌గా ఎంపికై ంది. ఇంతవరకూ ఫస్ట్ గ్రేడ్ ఉన్న పాలకొల్లును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఎంపిక చేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం జీవో విడుదల చేసింది.
ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల యూనియన్(ఐఎఫ్‌టీయు) ఆధ్వర్యంలో మంగళవారం ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు నెలంతా పనిచేసినా రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. చాలీచాలని జీతాలతో తాము బతకలేక పోతున్నామని, ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి, ఫుల్ టైం వేతనాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య, మున్సిపల్ యూనియన్ నాయకులు దేవరపల్లి రత్నబాబు తదితరులున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరానికి సంగీత, నృత్య కళాశాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్‌లో రూ. 5.25 కోట్లతో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మ్యూజియంకు సంపూర్ణ సహకారం అందిస్తామని, 3వ అంతస్తు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లా ఘన చరిత్రను ఈ మ్యూజియం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను నగర ప్రజలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింటు కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ, మేయరు షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ –2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, సామాజిక కార్యకర్త బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు


