19న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్
ఏలూరు టౌన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న సివిల్ మెన్ అండ్ విమెన్ అభ్యర్థులు ఈనెల 19న ఏలూరు అమీనాపేటలోని పోలీస్ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ముఖ్యమైన సర్టిఫికెట్లు, పత్రాలతో హాజరుకావాలనీ, సివిల్ కానిస్టేబుల్స్‌గా ప్రత్యేక శిక్షణకు వెళ్ళేందుకు ఈనెల 20న ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కేంద్రం ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు హాజరుకావాలని ఎస్పీ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అభ్యర్థులు విజయనగరం, అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌కు ఈ నెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళేందుకు ఏలూరు పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్ నుంచి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 9 నెలలపాటు కొనసాగే ఇండక్షన్ శిక్షణ తరగతులు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయని ఎస్పీ తెలిపారు. నిర్ణీత తేదీల్లో శిక్షణకు హాజరుకాని అభ్యర్థులు పేర్లు పోలీస్ శాఖ నిబంధన మేరకు ఎంపిక జాబితా నుంచి తొలగిస్తారన్నారు. ప్రతి అభ్యర్థి రూ.5 వేల భద్రతా బాండ్, సెక్యూరిటీ బాండ్‌ను రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై సమర్పించాలన్నారు. అభ్యర్థులు శిక్షణకు వెళ్ళేందుకు దిండు, ప్లాస్టిక్ బకెట్, మగ్, అరోగ్య భద్రత కార్డుల కోసం 3 పాస్ పోర్ట్‌సైజు ఫొటోలు తీసుకువెళ్ళాలని చెప్పారు.
విజయవాడకు కానిస్టేబుళ్లు
పెదవేగి: కానిస్టేబుళ్ల ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించేందుకు పెదవేగి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి మంగళవారం పంపించారు. బుధవారం సాయంత్రం యువగళం కార్యక్రమంలో వీరికి విజయవాడలో నియామక పత్రాలు అందిస్తారు.


