పండక్కి రోడ్ షో
న్యూస్‌రీల్
మరో షోకు సన్నాహాలు
భరోసా ప్రాజెక్టు రీస్టోర్
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు కోసం బాధితులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏలూరు ఎస్పీ ప్రాజెక్ట్ రీస్టోర్‌కు రూపకల్పన చేశారు. 8లో u
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: రోడ్ల అభివృద్ధి పేరిట చంద్రబాబు ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. పండక్కి జిల్లాకు వచ్చే వారి ముందు రోడ్లు బాగుచేస్తున్నట్టు షో చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. నాబార్డ్, ప్లాన్, ఎస్‌సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో 37 పనులు మంజూరు చేయగా 16 మాత్రమే పట్టాలెక్కాయి. గత ఏడాది సంక్రాంతికి ముందు హడావుడిగా చేసిన పనులు నాణ్యతలేక మూన్నాళ్ల ముచ్చటయ్యాయి.
జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో స్టేట్ హైవే, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 1,568 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉన్నాయి. రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి గత ఏడాది ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం దేశ విదేశాల్లో ఉంటున్న వారు సంక్రాంతి పండుగలకు జిల్లాకు రావడం పరిపాటి. బంధుమిత్రులను వెంట తీసుకువస్తుంటారు. ఇక్కడ జరిగే కోడిపందేలు, అమ్మవార్ల జాతరలను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వేలాదిగా జిల్లాకు వచ్చే సందర్శకులతో రోడ్లన్ని కిక్కిరిసిపోతాయి.
పండుగ చుట్టాల ముందు తమ పాలనను గొప్పగా చూపించుకునేందుకు గత ఏడాది రూ.42.57 కోట్లతో ప్యాచ్ వర్కులు, అత్యవసర మరమ్మతులు చేపట్టారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు చూస్తారంటూ ప్రకటనలు గుప్పించి కేవలం రూ.18.5 కోట్ల విలువైన 45 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. కొన్నిచోట్ల పండుగల మూడు రోజులు మన్నితే చాలన్నట్టు ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేయగా, మరికొన్నిచోట్ల గుంతల్లో మెటల్, చిప్స్ వేసి తారు వేయకుండా వదిలేయడంతో కొద్ది రోజులకే రాళ్లుపైకి లేచిపోయి ప్రమాదభరితంగా తయారయ్యాయి. కాగా గత సంక్రాంతి సీజన్‌లో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పనులు చేసేందుకు వారు వెనుకడుగేస్తున్నారు. ఇప్పటికే మొదలైన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, మిగిలిన వాటిని త్వరగా ప్రారంభించాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు చేపట్టేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో మరోమారు షో ప్రయత్నాలు మొదలయ్యాయి. నాబార్డ్, ప్లాన్, ఎస్‌సీసీ వర్క్స్, అడిషనల్ ఫండ్స్ రూ.141 కోట్లతో జిల్లాలో మార్టేరు–పక్కిలంక, పాలకొల్లు –దొడ్డిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు– ఆచంట, దువ్వ–ఆరుళ్ల, ఉద్దలపాలెం–దువ్వ, నరసాపురం–మేడపాడు, తాడేపల్లిగూడెంలోని విజయవాడ–విశాఖ తదితర రోడ్ల అభివృద్ధికి సంబంధించి 37 వర్క్‌లు మంజూరు చేసింది. వీటిలో రూ.53 కోట్లు విలువైన 16 వర్క్‌లు మాత్రమే టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలయ్యాయి. రూ.46 కోట్ల విలువైన 12 పనులు టెండర్ల దశలో, మిగిలిన వాటికి టెండర్లు పిలిచారు. యాన్యువల్ మెయింటినెన్స్ నిధులు రూ.మూడు కోట్లుతో 650 కిలోమీటర్లు మేర ప్యాచ్ వర్క్‌లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి రోడ్లు బాగుచేశామని చెప్పుకునే ప్రయత్నం
రూ.141 కోట్లుతో జిల్లాలో 37 పనులు
టెండర్ల దశలో 21, నిర్మాణంలో 16 పనులు
రూ. 3 కోట్లతో ప్యాచ్ వర్క్‌లు
త్వరితగతిన పూర్తిచేయాలని ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి
గతేడాది సంక్రాంతికి ముందు రూ.42 కోట్లతో హడావుడి పనులు
మూన్నాళ్ల ముచ్చటైన ప్యాచ్ వర్క్‌లు
పండక్కి రోడ్ షో
పండక్కి రోడ్ షో


