breaking news
Mudunri Prasad Raju
-
నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, అందుకే తెలివిగా వ్యవహరించి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా, ప్రజలకు నిజాయితీతో కూడిన పాలన అందించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘురామకృష్ణంరాజు, కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొన్నారు. -
'బాబుతో సహా కేబినెట్ మోసపూరితంగా వ్యవహారిస్తోంది'
తణుకు: రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం సహచరులు మోసపూరితంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం. ప్రసాదరాజు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకులో చేపట్టిన రైతు దీక్ష స్థలి ఆదివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్బంగా ఎం. ప్రసాదరాజు మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వార ప్రజల కష్టాలు తెలుసుకుని... రుణాలు మాఫీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ప్రసాదరాజు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం తీవ్ర వడిదుకులు ఎదుర్కొందని చెప్పారు. ఆ తర్వాత సీఎం అయిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగాన్ని పురోగామి దిశగా నడిపించారని చెప్పారు. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరిందంటే ఆ ఘనత మహానేతకే చెందుతుందని ప్రసాదరాజు తెలిపారు.