రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ | Sakshi
Sakshi News home page

రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌

Published Thu, Feb 15 2024 1:03 PM

TS:Congress Candidates To File Nomination For Rajya Sabha - Sakshi

  • రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్
  • మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు 
  • అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు
  • నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కాసేపట్లో​ కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పాల్గొంటారని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే.  రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్‌ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం.

Advertisement
 
Advertisement
 
Advertisement