బీజేపీ ‘వాషింగ్‌మెషిన్‌’ను ప్రదర్శించిన తృణమూల్‌ నేతలు | Trinamool Washing Machine Jibe At BJP | Sakshi
Sakshi News home page

‘వాషింగ్‌ మెషిన్‌’ బీజేపీ: తృణమూల్‌ నేతల సెటైర్లు

Mar 30 2024 6:58 PM | Updated on Mar 30 2024 7:10 PM

Trinamool Washing Machine Jibe At Bjp - Sakshi

కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) పార్టీ సెటైర్లు వేసింది. బీజేపీ ఒక వాషింగ్‌మెషిన్‌ పార్టీ  అని శనివారం(మార్చ్‌ 30) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తృణమూల్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్‌మీట్‌లో తృణమూల్‌ నేతలు బీజేపీ వాషింగ్‌ మెషిన్‌ అని స్టిక్కర్లు అతికించిన వాషింగ్‌ మెషిన్‌ను ప్రదర్శించడం ఆసక్తి రేపింది.

దీనికి తోడు ‘వాషింగ్‌ పౌడర్‌ బీజేపీ’ అనే టైటిల్‌తో వీడియోను కూడా తృణమూల్‌ నేతలు రిలీజ్‌ చేశారు. అవినీతి కేసులున్న పక్క పార్టీల నేతలు బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్‌ పొందుతున్నారనేది ఈ వీడియోలో సెటైరికల్‌గా చూపించారు.  ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌పై ఉన్న విమానాల లీజు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్‌చిట్‌ ఎందుకిచ్చిందని తృణమూల్‌ నేత రితబ్రతా బెనర్జీ ప్రశ్నించారు.

తమకు లొంగనందునే అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరేన్‌లను బీజేపీ అరెస్టు చేయించిందని తృణమూల్‌ నేతలు మండిపడ్డారు. శరద్‌పవార్‌ ఎన్‌సీపీని చీల్చి మేనల్లుడు అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇది జరిగి సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత ఎయిర్‌ ఇండియా విమానాల లీజు కేసులో ప్రఫుల్‌ పటేల్‌కు సీబీఐ తాజాగా క్లీన్‌ చిట్‌ ఇస్తూ దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. 

ఇదీ చదవండి.. లిక్కర్‌ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ 

Advertisement
 
Advertisement
Advertisement