అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభం
సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ
గురువరాజుపల్లె సమీపంలో రాత్రి బస
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం 7వ రోజు బుధవారం (ఏప్రిల్ 3) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు.
అన్నమయ్య జిల్లా సిద్ధమా?
మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకి ఆరవ రోజు అన్నమయ్య జిల్లా సిద్ధమా? అంటూ మంగళవారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు జనప్రభంజనం కదం తొక్కి ముందుకు సాగింది. –సాక్షి,అమరావతి


